బ్రేకింగ్‌: ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌పై ట్విస్ట్‌... అప్ప‌టి వ‌రకు నో

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. వాస్త‌వంగా చూస్తే మార్చి 31వ తేదీలోగా బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హించాల్సి ఉంది. అయితే వ‌చ్చే నెల 14 త‌ర్వాతే అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏపీలో మార్చి 11 మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఓట్ల లెక్కింపు మార్చి 14న జ‌రుగుతుంది.

ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ బిజీ కానున్నారు. అందుకే ఈ లోగా బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం కంటే.. ఆ త‌ర్వాతే పెట్టుకోవాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే వ‌చ్చే నెల 14 త‌ర్వాతే బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నెల 23వ తేదీన జరిగే మంత్రి వర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: