ఏపీలో మరో ఎన్నికల షెడ్యూల్ ఇది కాస్త టఫ్ వార్...?

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్యెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యల్ విడుదల చేసారు. ఖాళీ అయిన ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈనెల 25న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మార్చి 15న ఎన్నిక అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. మార్చి 4వ తేది వరకు నామినేషన్లు లకు గడువు మార్చి 5న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 8న నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంటుంది.

ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటలకు వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా తో ఉప ఎన్నిక జరుగుతుంది. చల్లా రామకృష్ణా రెడ్డి మృతి తో ఉప ఎన్నిక జరుగుతుంది. వచ్చే నెల 29 తో మహ్మద్ ఇక్బాల్, తిప్పేస్వామి, సంధ్యారాణి, వీర వెంకన్న చౌదరిల పదవీకాలం ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీనే ఆరు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: