భారత్లో మళ్లీ కరోనా కోరలు... భయపెడుతోన్న లెక్కలు
ఇప్పటి వరకూ కరోనా దెబ్బతో భారత్లో 1.56 లక్షల మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,127 గా ఉంది. 1,06,78,048 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా లెక్కలు చూస్తుంటే ప్రజల్లో కరోనా పట్ల భయం పోవడంతో పాటు జాగ్రత్తలు కూడా పాటించకపోవడంతో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ఈ లెక్కలు ప్రజల్లో మళ్లీ భయాందోళనలు కలుగ చేస్తున్నాయి.