మీకు జ‌గ‌న్ కావాలా... న‌వీన్ ప‌ట్నాయ‌క్ కావాలా... పెద్ద గొడ‌వ ?

VUYYURU SUBHASH
ఏపీ - ఒడిశా స‌రిహ‌ద్దులోని కొఠియా గ్రామ‌స్తులు ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఓట్లేయ‌డంతో వాళ్ల‌కు ఒడిశా అధికారుల నుంచి చిత్ర‌మైన ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. మీకు ఆంధ్రా కావాలా ?   ఒడిశా ?  కావాలా ?  మీకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కావాలా ?  న‌వీన్ ప‌ట్నాయ‌క్ కావాలా ? అన్న ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. విజయనగరం జిల్లా సాలూరు మండలం కోనదారుకు చెందిన కొందరు ఉపాధి హామీ డబ్బుల కోసం పొట్టంగి బ్యాంకుకు వెళ్లగా అధికారుల నుంచి ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి.

మీరు ఏపీ ఎన్నిక‌ల్లో ఓట్లేయ‌డంతో మీకు ఉపాధి హామీ డ‌బ్బులు ఇవ్వ‌మ‌ని వాళ్లు చెప్పారంటూ  ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ వాపోయింది. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడంపై కొందరు ఒడిషా అధికారులు వచ్చి నిలదీశారని గ్రామస్థులు తెలిపారు. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ 34 గ్రామాల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని.. అవి అరకు, సాలూరు నియోజకవర్గాల పరిధిలోని ఏపీ గ్రామాలేనని సుప్రీంకోర్టుకు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: