కృష్ణా: తిరువూరులో జ‌న‌సేన సూప‌ర్ విక్ట‌రీ

VUYYURU SUBHASH
కృష్ణా జిల్లాలో నాలుగో ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఊహించ‌ని ప్రాంతాల్లో విజ‌యం సాధిస్తోంది. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌నసేన బోణీ కొట్టింది. నియోజ‌క‌వ‌ర్గంలోని గాదె వారి గూడెం సర్పంచ్ గెలుపుతో తిరువూరు నియోజకవర్గంలో బోణీ కొట్టిన జనసేన కార్య‌క‌ర్త‌ల ఆనందాల‌కు అవ‌ధులు లేకుండా పోయాయి.  గంపలగూడెం మండలం గాదె వారి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చెన్న శ్రీనివాస్ 120 ఓట్ల గెలుపుతో జనసేన తొలి ఖాతా తెరిచింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన‌కు అంత‌గా ప‌ట్టులేక‌పోయినా ఘ‌న‌విజ‌యం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: