ఆ టీడీపీ సీనియ‌ర్ తప్ప‌తాగారు... ఏపీ మంత్రి ఫైర్‌

VUYYURU SUBHASH
ఏపీ టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జేసి దివాక‌ర్ రెడ్డిపై అధికార పార్టీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అనంత‌పురం జిల్లాకు చెందిన ప‌లువురు వైసీపీ నేత‌లు దివాక‌ర్‌ను గ‌ట్టిగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా అదే జిల్లాకు చెందిన మంత్రి శంక‌ర్ నారాయ‌ణ సైతం జేసీపై తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. జేసీ దివాకర్ రెడ్డి తప్పతాగి మాట్లాడుతున్నట్లుందని మంత్రి శంకరనారాయణ అన్నారు.

ఆయ‌న నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడితే తాము స‌హించ‌మ‌ని కూడా చెప్పారు. జేసీ కుటుంబ ఆగ‌డాల‌కు వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే బ్రేక్ ప‌డింద‌ని.. అది త‌ట్టుకోలేకే ఆయ‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని మంత్రి శంక‌ర నారాయ‌ణ విమ‌ర్శించారు. జ‌గ‌న్ గురించి జేసీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే అనంత‌పురం ప్ర‌జ‌లు జేసీ నాలుక తెగ కోస్తార‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా జేసీ కుటుంబం తాడిప‌త్రిలో ఎన్నో అరాచ‌కాలకు పాల్ప‌డింద‌ని.... అందుకే జేసీ ఫ్యామిలీ తాడిపత్రి ప్ర‌జ‌లు చిత్తుగా ఓడించార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: