టాలీవుడ్ ప్రముఖుడి వ్యవహారం... తెలంగాణా సర్కార్ కు సుప్రీం కోర్ట్ షాక్
బెయిల్ రద్దు చేయాలంటూ సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ లో సినీ నటి శ్రీసుధ పిటీషన్ వేసారు. సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేసిన తరువాత తనను చంపడానికి కుట్ర చేసి , విజయవాడ లో కారు ఆక్సిడెంట్ చేశారంటూ కోర్టుకి శ్రీసుధ వివరించారు. ఈ కేసులో శ్యామ్ కె నాయుడు తో పాటు ఆయన సోదరుడు చోటకే నాయుడు కూడా బెదిరింపులకు దిగుతున్నట్లు ఆమె ఆరోపించింది. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి , శ్యామ్ కె నాయుడు కు సుప్రీం కోర్ట్ నోటీసులు ఇచ్చింది. నెలరోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.