న్యూజిలాండ్‌లో భూకంపం.. సునామీ

Garikapati Rajesh

న్యూజిలాండ్ తీరంలో భారీ భూకంపం సంభవించింది. అనంతరం సునామీ హెచ్చరికలు కూడా జారీ కావ‌డంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని  అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం (మార్చి 5) వేకువజామున 3 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8.30 గంటలకు) భూకంపం వచ్చింది. న్యూజిలాండ్ ఉత్తర ద్వీపానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. తీర ప్రాంత ప్రజలకు సునామీ ముప్పు ఉందని న్యూజిలాండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతంలో ఇళ్లు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని, భూమి కోతకు గురి కావొచ్చునని తెలిపింది. భూకంపానికి ఇళ్లలోని వస్తువులు, సీలింగ్ ఫ్యాన్లు కదిలాయి. అందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ‘అందరూ సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నా..’ అని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ పోస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: