స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై స్వ‌రూపానంద‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

VUYYURU SUBHASH
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర‌సిస్తూ ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్య‌మాలు న‌డుస్తున్నాయి. అటు తెలంగాణ రాజ‌కీయ నేత‌లు సైతం ఇందుకు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర స్వామి సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌కుండా అడ్డుకుంటామ‌న్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌రించ‌డం అన్యాయ‌మ‌ని... న‌ష్టాల్లో ఉంద‌ని చెప్పి ఎలా ప్రైవేటీక‌రిస్తార‌ని... ప్ర‌జ‌ల సెంటిమెంట్ ఎలా ప‌క్క‌న పెడ‌తార‌ని స్వామి ప్ర‌శ్నించారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజల్లో పాల్గొన్న స్వామిజీ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: