ఏపీలో మునిసిపాల్టీ, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అధికార
వైసీపీ కౌంటింగ్ లో దూసుకుపోతోంది. అన్ని ఏరియాల్లోనూ
వైసీపీ తిరుగులేని విజయాలతో దూసుకు పోతోంది. ఎన్నికలకు ముందే నాలుగు మున్సిపాల్టీలు ఏకగ్రీవంగా గెలుచుకున్న
వైసీపీ ఈ రోజు మరో 11 మున్సిపాల్టీలను ఇప్పటికే గెలుచుకుంది. మదనపల్లి, రాయచోటి, యర్రగుండ్ల, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, కనిగిరి, కొవ్వూరు, గిద్దలూరు, పిడుగురాల్ల, పులివెందుల, మాచర్ల, పుంగనూరు, డోన్ మున్సిపాల్టీలను
వైసీపీ గెలుచుకుంది.