బ్రేకింగ్‌: ష‌ర్మిల పార్టీలో చేరిన ప్ర‌జాగాయ‌కుడు ఏపూరి సోమ‌న్న‌

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో ష‌ర్మిల పెట్టే కొత్త పార్టీ ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ప‌లువురు కీల‌క నేత‌లు ఇప్ప‌టికే ఆ పార్టీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టిస్తున్నారు. మ‌రి కొంద‌రు ఆమె పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ష‌ర్మిల పార్టీ ఎనౌన్స్ చేసిన వెంట‌నే ఆ పార్టీలో చేరి క్రియాశీల‌క పాత్ర పోషించేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఆమె పార్టీ పెట్ట‌కుండానే ప్ర‌జా గాయ‌కుడు ఏపూరి సోమ‌న్న పార్టీలో చేరుతున్న‌ట్టు చెప్పారు.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి హ‌క్కుల‌కోసం పారాటం చేశాం.. నా జీవితం పాట‌కే అంకితం అయ్యింది.. 20ఏళ్ల క్రింద‌ట ప్రారంభించిన నా పాట ఎంతో మందిలో ఉద్య‌మ స్పూర్తిని ర‌గిలించింది.. ఉద్యోగం ఇచ్చిన‌ట్లే ఇచ్చి వెన‌క్కు తీసుకున్నారు... అంత‌కు ముందే పరిస్థితిని గ‌మ‌నించి రాజీనామ చేశాన‌ని చెప్పారు. ఇక తెలంగాణకోసం ప్రాణ‌త్యాగం చేసిన కుటుంబాల‌కు కేసీఆర్ న్యాయం చేయ‌లేదని... ఉద్య‌మంతో సంబందం లేని వారు బుగ్గ కార్లో తిరుగుతున్నారు... న‌న్ను నా పాట‌ను అన‌చివేసేందుకు కేసీఆర్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేద‌న్నారు. తెలుగు గ‌డ్డ‌పై ఎన్టీఆర్ ఎంతో వైఎస్సార్ కూడా అంతే అని.. రాజ‌న్న బిడ్డ‌గా ఆమెకు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: