తెలంగాణలో
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్
రెడ్డి సోదరి కొత్త
పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన వెంటనే రాజకీయాలు వేడెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు కీలక నేతలు ,
టీఆర్ఎస్ పార్టీ నేతల వారసులు కూడా వచ్చి షర్మిలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ రంగాలతో సంబంధం లేని వారు షర్మిల ను కలుస్తున్నారు. తాజాగా ఈ రోజు లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలను సానియామీర్జా సోదరి ఆనం
మీర్జా తో పాటు అజారుద్దిన్ తనయుడు మహ్మద్ అసదుద్దిన్ కూడా కలిశారు. వీరిద్దరు తమ భేటీకి రాజకీయాలకు సంబంధం లేదని.. మర్యాద పూర్వకభేటి అని ఆనంమీర్జా,అసదుద్దిన్ చెప్పారు.