ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 463వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలు ఇప్పటికే యేడాదికి పైగా కంటిన్యూ అవుతున్నాయి. దీక్షల్లో స్థానికంగా రైతులు, రైతు కూలీలు కూర్చొంటున్నారు. దీక్షలు కంటిన్యూ చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. రాజధాని పరిధిలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: