ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌

VUYYURU SUBHASH
ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడంతో ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సిద్ధమయింది. పీఆర్సీ అమ‌లు, విధివిధానాల కోసం ప్ర‌భుత్వం క‌మిటీని కూడా నియ‌మించింది. పీఆర్సీ ఛైర్మన్ నివేదికపై అధ్యయనానికి ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సభ్యులుగా ముఖ్య సలహాదారు, రెవెన్యూ, ఆర్థిక, జీఏడీ అధికారులు ఉంటారు. ఇప్ప‌టికే ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డంతో వారికి సంబంధించిన పీఆర్సీపై కూడా ఈ క‌మిటిలో చ‌ర్చించి ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: