ఏపీలో గత రెండు నెలలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయ పక్షాలను ఎంతగా కుదిపివేస్తుందో చూస్తూనే ఉన్నాం. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రం దాదాపుగా నిర్ణయం తీసేసుకోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ వార్ ఇలా ఉండగానే ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది.
గడిచిన నాలుగు నెలల్లో 800 కోట్ల నెట్ ప్రాఫిట్
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో 1200కోట్ల రూపాయల ఉత్పత్తి లాభాలను
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్జించిందని పేర్కొంది. దీంతో లాభాలను ఆర్జిస్తున్న
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించడం ఎందుకని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.