దేశ వ్యాప్తంగానే కాదు మహారాష్ట్ర కరోనా కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే రోజుకో కొత్త రికార్డు ఇక్కడ నమోదు అవుతుండగా... తాజాగా మరో కొత్త రికార్డు నమోదు అయ్యింది. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 47,827 మంది కరోనా వైరస్ భారినపడ్డారు. ఇక కరోనాకు చికిత్స పొందుతూ మరో 202 మంది ప్రాణాలు కోల్పోయారు.తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,04,076కు పెరిగింది. ఇక ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో కరోనాతో 55,100 మంది మరణించారు. పూణే, నాగపూర్, థానే, విదర్భ ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.