అర్చకుల విషయంలో
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి పేరుతో రిటైర్డ్ అయ్యిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయ్యిన ప్రధాన అర్చకులతో పాటు అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం అంటూ
టీటీడీ ఆదేశాలు జారీ చేసింది.
టీటీడీ ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకుడి హోదాలో ఆలయ ప్రవేశం చేయనున్నారు రమణదీక్షితులు. ప్రస్తుతం వున్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడం పై సందిగ్దం నెలకొంది