తెలంగాణలో టీడీపీ ఇప్పటికే దుస్థితిలో ఉంది. అసలు ఆ పార్టీ అక్కడ ఉందో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ కేడర్‌కు శరాఘాతంగా మారింది. ఈ క్రమంలోనే విపక్షాల నుంచి కూడా టీడీపీ పనైపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీది ముగిసిన అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తిరుపతిలో రత్న ప్రభకు మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఎలా పతనమైపోయిందో ఇప్పుడు ఏపీలోనే అదే పరిస్థితి ఎదుర్కోబోతోందని రఘునందన్ రావు అన్నారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీయే నని ఆయన చెప్పారు. రాజకీయ రణరంగం నుంచి టీడీపీ తప్పుకుందని ఆయన ఎద్దేవా చేశారు.