ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంకా ఆరునెలలు కంటే ఎక్కువ కాలం కొనసాగలేరని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసుపై ఆయన కుమార్తె సునీత అడిగే ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలన్నారు. ఇక జగన్ సొంత సోదరి షర్మిలకు అన్నతో తీవ్రమైన విబేధాలు ఉన్నాయని చింతామోహన్ అన్నారు.
షర్మిల అన్నతో విభేదించి షర్మిల తెలంగాణపై పగ తీర్చుకుంటుందని చింతామోహన్ ఎద్దేవా చేశారు. తిరుపతిలో బీజేపీ పోటీ నామమాత్రమేనని చెప్పారు. ఇక జనసేన బీజేపీకి మద్దతు ఇస్తోన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాటలను ఎవరూ పట్టించుకోరని చింతామోహన్ అభిప్రాయపడ్డారు. సీనియర్ పార్లమెంటేరియన్ అయిన చింతామోహన్ తిరుపతి ఎన్నికల బరిలో తొమ్మిదోసారి పోటీ చేస్తున్నారు.