బాబు మాట భేఖాతార్ చేసిన అఖిల‌ప్రియ‌.. ఏం ట్విస్ట్ ఇచ్చిందిలే...!

VUYYURU SUBHASH
టీడీపీ అధినేత ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని పిలుపు ఇచ్చినా ఆయ‌న మాట‌ల‌ను మాత్రం పార్టీ నేత‌ల్లో చాలా మంది ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్లు బాబుపై గుస్సాతో ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ సైతం బాబు మాట‌ను భేఖాతార్ చేశారు. ఆళ్లగడ్డలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. ఈ నెల 8వ తేదీన జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్లు వేసిన వారు బరిలోనే ఉంటారని, కష్టమో, నష్టమో తేల్చుకుంటారని భూమా అఖిలప్రియ తెలిపారు. అభ్యర్థుల తరుపున అఖిలప్రియ ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: