రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నీలం సాహ్నీ బాధ్యతలు తీసుకున్న వెంటనే పరిషత్ ఎన్నికలకు కేవలం వారం రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ కంటిన్యూ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై అఖిలప్రియ మాట్లాడుతూ నీలం సాహ్ని తీసుకుంటునన నిర్ణయాలను చూసి ఇతర రాష్ఠ్రాల ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కనీసం నోటిఫికేషన్ జారీ చేసే ముందు ప్రొసీజర్ కూడా ఫాలో కాలేదని భూమా అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. అయితే బాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆళ్లగడ్డలో అఖిలప్రియ పార్టీ అభ్యర్థులను పోటీలో ఉంచారు.