క‌రోనా వ‌ణుకు... కేసుల్లో టాప్ - 10 జిల్లాలు ఇవే

VUYYURU SUBHASH
దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా పెరిగిపోతోందని, వచ్చే నాలుగు వారాలు అత్యంత సంక్లిష్టమైనని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సెకండ్‌ వేవ్‌ని కట్టడి చేయడం ప్రజల చేతుల్లోనే ఉందని హితవు పలికింది. ప్ర‌జ‌లు అంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కూడా ప్ర‌భుత్వం సూచ‌న‌లు చేసింది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా సెకండ్ వేవ్ మాత్రం ఆగ‌డం లేదు. ఇక దేశ‌వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా వస్తున్న జిల్లాల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ చేరింది. మహారాష్ట్ర నుంచి ఏడు, కర్ణాటక నుంచి ఒక జిల్లా, ఢిల్లీ టాప్‌ టెన్‌ జాబితాలో ఉన్నాయి. పుణె, ముంబై, థానే, నాగ్‌పూర్, నాసిక్, బెంగళూరు అర్బన్, ఔరంగాబాద్, అహ్మద్‌నగర్, ఢిల్లీ, దుర్గ్‌ల నుంచి అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: