భారత్‌లో కరోనా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. దేశంలో వరుసగా మూడో రోజు 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 96,982 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 26 లక్షల 86 వేల49కి చేరుకుంది. గత మూడు రోజులుగా వరుసగా కేసులు పరిశీలిస్తే లక్షా 3వేల 558 కేసులతో ఆల్ టైమ్ హైకి చేరుకున్న మర్నాడు కూడా 97 వేలకు చేరువగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
మూడు రోజుల పాటు రోజుకు వరుసగా 90 వేలకు తగ్గకుండా కేసులు నమోదు కావడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. ఇక కరోనా మహారాష్ట్రని ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. రోజూ 47 వేలకు పైగా కేసులు నమోదు అవుతూ ఉండడంతో ఆంక్షల్ని కఠినతరం చేయాల్సి వచ్చింది. మళ్లీ ముంబైలో జనాలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: