వెయ్యి కార్లతో ఖమ్మంలో అడుగు పెడుతున్న షర్మిల

తెలంగాణాలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఖమ్మం సభ విషయంలో ఆసక్తికర చర్చలు ఉన్నాయి. ఎల్లుండి ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో షర్మిల సంకల్ప సభ నిర్వహిస్తారు. పార్టీ పెడుతున్నట్లు ప్రకటన చేయనున్న షర్మిల... మరికొన్ని కీలక ప్రకటనలు కూడా చేసే అవకాశం ఉంది.

షర్మిల సభ కు ముఖ్య అతిథిగా వైఎస్ విజయలక్ష్మి హాజరు అవుతారు. లోటస్ పాండ్ నుంచి వెయ్యి కార్ల తో ఖమ్మం కి ప్రయాణం అవుతారు ఆమె. దారి పొడువునా 6 చోట్ల షర్మిల కు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే సభ జరుపుతున్నాం అని షర్మిల టీం పేర్కొంది. ఇవ్వాళ మధ్యాహ్నం 1గంటలకు ఖమ్మం సీపీ  తో షర్మిల టీం భేటీ అవుతుంది. జి ఓ 68&69 ప్రకారం సభ నిర్వహణ పై సీపీ కి ఏర్పాట్లను షర్మిల టీం వివరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: