భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంతకంతకూ విజృంభిస్తోంది. కనివినీ ఎరగని రీతిలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నియి. కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతూనే.. మరోవైపు కేసులు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,15,736 కొత్త కరోనా కేసులు నమోదు కాగా... 630 మంది మృతి చెందారు. 24 గంటల్లో ఈ కొత్త కేసులు, మరణాలు కూడా సరికొత్త రికార్డుగా నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,28,01,785 కి చేరింది. ఇక యాక్టీవ్ కేసులు 8,43,473గా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా తో మృతి చెందిన వారి సంఖ్య 1,66,177 గా ఉంది. ఇప్పటి వరకు టీకా వేసుకున్న వారి సంఖ్య 8,70,77,474గా నమోదు అయ్యింది.