పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2 వేల థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తమ అభిమాన నటుడి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్స్ హైదరాబాద్‌లో పలు కీలక థియేటర్ల వద్ద బారులు తీరారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ వెండితెరపై చూసేందుకు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు .కరోనాని సైతం లెక్క చేయకుండా నానా హంగామా చేస్తున్నారు. థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే వకీల్ సాబ్‌కు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సినిమా టిక్కెట్స్ కోసం కష్టపడుతున్నారు.