క‌రోనా దెబ్బ‌తో ఆ దేశం గ‌జ‌గ‌జా... ఒకే రోజు 4వేల మ‌ర‌ణాలు

VUYYURU SUBHASH
కోవిడ్-19 ధాటికి బ్రెజిల్ చిగురుటాకులా వణుకుతోంది. ఒకే రోజులో 4 వేలకు పైగా కరోనా మరణాలు నమోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో ఈ దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు ఏకంగా 4,195 సంభ‌వించాయి. దీంతో మృతుల సంఖ్య 3.40 లక్షలకు చేరింది. అమెరికా, పెరూ తర్వాత ఒకే రోజు 4 వేలకు పైగా మరణాలు నమోదైన మూడో దేశంగా బ్రెజిల్‌ నిలిచింది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం, అత్యధికులు ఆస్పత్రి పాలవుతుండడంతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. దేశాన్ని కరోనా ఈ స్థాయిలో భయపెడుతున్నా దేశాధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు 3 శాతం వ్యాక్సిన్ కూడా న‌మోదు కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: