తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో
ఆది, సోమవారాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు చోటు చేసుకుంటున్నాయి. 40 - 45 డిగ్రీల వరకు ఎండలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం తెలంగాణలో స్వల్పంగా వర్షాలు కురిశాయి. మధ్య
మహారాష్ట్ర,
కర్ణాటక,
కేరళ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.