హాలీవుడ్ బాక్సాఫీస్‌పై క‌రోనా ఎఫెక్ట్ ఈ రేంజ్‌లోనా

VUYYURU SUBHASH
ప్ర‌పంచాన్ని నాశ‌నం చేస్తోన్న క‌రోనా ఎఫెక్ట్ హాలీవుడ్‌ బాక్సాఫీస్‌పై కూడా మ‌రోసారి తీవ్రంగా‌ పడింది. దీంతో సినిమాలు వాయిదా పడుతున్నాయి. తాజాగా యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌ నటించిన టాప్‌ గన్‌: మ్యావరిక్ - మిషన్‌: ఇంపాజిబుల్ 7 సినిమాలు రిలీజ్‌లు వాయిదా పడ్డాయి. 1986లో టామ్ క్రూజ్ న‌టించిన టాప్‌ గన్ కు సీక్వెల్‌గా టాప్‌ గన్‌: మ్యావరిక్ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాను ముందు జూలై 2న విడుద‌ల చేయాల‌నుకుని.. చివ‌ర‌కు న‌వంబ‌ర్ 19కు వాయిదా వేశారు.

మిషన్‌: ఇంపాజిబుల్ 7 సినిమాను 2022 నవంబరు 4 నుంచి 2023 జూలై 7కి వాయిదా వేశారు. వీటితో పాటుగా ఈ ఏడాది జూలై 23న విడుదలకు షెడ్యూల్‌ అయిన స్నేక్‌ ఐస్ అక్టోబరు 22కి పోస్ట్‌పోన్‌ అయ్యింది. దీంతో మ‌రికొన్ని భారీ బ‌డ్జెట్ సినిమాలు కూడా వాయిదా ప‌డ్డాయి. దీంతో వేల కోట్ల న‌ష్టం త‌ప్పేలా లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: