భార‌త్‌ను క‌మ్మేసిన క‌రోనా... శ‌నివారం కొత్త రికార్డు

VUYYURU SUBHASH
భారత్‌ను కరోనా పూర్తిగా కమ్మేస్తోంది.. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వ‌స్తోంది. శ‌నివారం దేశ‌వ్యాప్తంగా 1.46 ల‌క్ష‌ల కేసులు న‌మోదు అయ్యాయి. వరుసగా ఐదో రోజు లక్షకు పైగా కేసులు నమోదవ్వగా.. ఈసారి ఆ కేసుల సంఖ్య లక్షా 50 వేలకు చేరువవ్వడం ఆందోళన కలిగిస్తోంది. క‌రోనా క‌ట్ట‌డికి ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా కేసులు మాత్రం ఆగ‌డం లేదు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 10 లక్షలు దాటాయి. గత సెప్టెంబర్‌ తర్వాత యాక్టివ్‌ కేసులు పెరగడం ఇదే మొదటిసారి. గత పది రోజుల్లోనే యాక్టివ్‌ కేసులు 47శాతం పెరిగాయి. ఎప్పటిలాగానే మహారాష్ట్రలో 60 వేల కేసులు నమోదయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: