మ‌రో రాష్ట్రం బీజేపీ చేజారుతోంది... లోక‌ల్లో ఘోర ప‌రాభ‌వం

VUYYURU SUBHASH
మ‌రో రాష్ట్రం బీజేపీ చేజార‌నుందా ? అంటే తాజాగా జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు అవున‌నే చెపుతున్నాయి. త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (టీటీఏఏడీసీ) ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగలింది. తిప్రాహా ఇండిజెనియస్ ప్రోగ్రెసివ్ రీజనల్ అలయెన్స్ (టీఐపీఆర్ఏ) మోతా ఘన విజయం సాధించింది. రాజవంశీకుడు ప్రద్యోత్ కిశోర్ దేబ్‌బర్మ ఈ రాజకీయ సంస్థను స్థాపించారు.

 
ఇక్క‌డ మొత్తం 28 స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీఐపీఆర్ఏ 18 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ 9 స్థానాలతో సరిపెట్టుకోగా, దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్‌టీకి ఒక్క స్థానమూ దక్కలేదు. స్వతంత్ర అభ్యర్థి ఒక్క స్థానంలో గెలుపొందాడు. ఇక గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మూడు ద‌శాబ్దాల పాటు సీపీఎంకు పెట్ట‌ని కోట‌గా ఉన్న ఈ రాష్ట్రాన్ని బీజేపీ అనేక ప్ర‌లోబాల‌తో హ‌స్త‌గ‌తం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: