సాగ‌ర్లో ఒక్కో ఫ్యామిలీకి పంప‌కాలు ఇవే.. కిలో మ‌ట‌న్‌తో స్టార్ట్‌

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్రధాన పార్టీలో ప్ర‌లోబాల‌కు తెర‌దీశాయి. ఓ రాజ‌కీయ పార్టీ అయితే గ్రామాల్లో ఒక్కో ఫ్యామిలీకి కిలో మ‌ట‌న్‌, ఒక మ‌ద్యం బాటిల్ పంపిణీ చేసింది. నిన్న ఉగాది కావ‌డంతో ఉగాదికి మ‌ట‌న్‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డుతుంది. అన్ని ఫ్యామిలీలు మ‌ట‌న్ తినేందుకు ఆస‌క్తి చూపుతాయి. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీ ఒక్కో కుటుంబానికి కిలో మ‌ట‌న్‌తో పాటు మ‌ద్యం బాటిల్ పంపిణీ చేసింది.

ఇక మ‌రో రాజ‌కీయ పార్టీ సైతం కిలో మటన్ చొప్పున పంచిందట. కొన్ని గ్రామాలలో 500 రూపాయల చొప్పున ఇప్పటికే పంపిణీ చేశారట. మ‌ళ్లీ ఎన్నిక‌ల ముందు ఓటు డిమాండ్‌ను బ‌ట్టి రు. 1500 నుంచి రు. 2 వేల వ‌ర‌కు పంచుతార‌ని ఓట‌ర్లు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: