ఏపీ కొత్త రాజధానిగా అవతరించిన విశాఖలో రోజు రోజుకు క్రైం రేటు దారుణంగా పెరిగి పోతోంది. విశాఖపట్నంలోని
పెందుర్తి నియోజకవర్గంలోని జుత్తాడలో దారుణం చోటు చేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు ప్రాధమిక నిర్దారణకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరందరినీ ఒకే వ్యక్తి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు అప్పలరాజుగా పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.