ఇండియా ఒక్క రోజే 2 లక్షల కేసులు, అమెరికా దగ్గరలో భారత్...?

మన దేశంలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కరోనా కట్టడికి తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కష్టపడుతున్నా సరే కేసులు మాత్రం భారీగా పెరగడంతో ఎం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో కేంద్రం ఉంది. గడచిన 24 గంటలలో 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా1038 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 93,528 గా ఉంది.

దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,74,564 నమోదు అయ్యాయి.  దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 14,71,877 కాగా... “కరోనా” కు చికిత్స పొంది  డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,24,29,564 గా ఉంది.  “కరోనా” వల్ల దేశంలో వ్యాప్తంగా మృతి చెందిన వారి  సంఖ్య 1,73,123 గా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 33,13,848 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: