వైసీపీ ఎమ్మెల్యే పిటిష‌న్‌పై సుప్రీం సంచ‌ల‌న నిర్ణ‌యం

VUYYURU SUBHASH
మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూ కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పార్టీ కార్యాల‌యానికి ఈ భూములు కేటాయించ‌డం స‌రికాద‌ని మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి కొద్ది రోజులుగా కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఈ భూములు అక్ర‌మ ప‌ద్ధ‌తుల్లో కేటాయించార‌ని ఆయ‌న ఆరోపించారు. నీటి వ‌న‌రులు ఉన్న ప్రాంతాన్ని పార్టీ ఆఫీస్ కోసం ఎలా ?  కేటాయిస్తార‌న్న ఆర్కే సుప్రీంలో పిటిష‌న్ వేశారు. దీనిని విచారించిన స్టిస్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై హైకోర్టులో తేల్చుకోవాలని ఆదేశించింది. నాలుగు నెలల్లో పిటీషన్ ను విచారించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: