ఆంధ్రుల కలల హక్కు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ కొద్ది రోజులుగా విశాఖలో ఉద్యమం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా కార్మిక సంఘాలు మాత్రం తమ ఆందోళన ఆపడం లేదు. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను మే నెల 7వ తేదీన బంద్ చేయాలని అఖిలపక్షం నిర్ణయించింది. తాము ఎంతగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మేనెల 7వ తేదీన బంద్ చేయాలని నిర్ణయించింది. ఈ బంద్ కుఅందరూ సహకరించాలని కోరింది. ఇక ఇప్పటికే కొద్ది రోజుల క్రితం చేపట్టిన ఏపీ బంద్కు వైసీపీ కూడా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.