కరోనా కేసుల సంఖ్య భారత్లో మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 3,49,691 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,767 మంది కరోనాతో మరణించారు. తాజా లెక్కలు కూడా కలుపుకుంటే భారత్లో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,60,172 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,92,311 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 26,82,751 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,40,85,110 మంది డిశ్చార్జ్ అయ్యారు.