కరోనా మహ్మమ్మారి అనేక రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. దేశంలో సగటున రోజుకు 3 లక్షలకు పైగా కేసులు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర కరోనా కేసులతో ఎంతలా విలవిల్లాడుతుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు మరో రాష్ట్రం కూడా మహారాష్ట్ర బాటలోనే విలవిల్లాడుతోంది. ఛత్తీస్‌ఘడ్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క శనివారమే పద్దెనిమిదివేల కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం అనధికారికంగా లాక్‌డౌన్ పెట్టినా, నైట్ కర్ప్యూ ఉన్నా కూడా ఇక్కడ కరోనా తీవ్రతకు బ్రేక్ పడడం లేదు.