గుడ్ న్యూస్‌: కోవాగ్జిన్ రేటు త‌గ్గింపు.. మ‌రింత చ‌వ‌క‌

VUYYURU SUBHASH
క‌రోనాకు మంచి ఆయుధంగా ఉన్న కోవాగ్జిన్ మ‌రింత చ‌వ‌క కానుంది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ తమ కోవిడ్‌ టీకా కోవాగ్జిన్‌ ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసును రూ.600గా ఇదివరకు నిర్ణయించిన భారత్‌ బయోటెక్‌ దాన్ని రూ.400కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. అయితే కేంద్ర ప్ర‌భుత్వానికి మాత్రం ప్ర‌తి డోసుకు రు. 150 తీసుకుంటూ... ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్‌ ఆస్పత్రులకు అధిక ధరను నిర్ణయించడంపై విమర్శలు రావడం తెల్సిందే. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కూడా రు. 200 మాత్ర‌మే వ‌సూలు చేయాల‌ని భార‌త్ బ‌యోటెక్ నిర్ణ‌యించింది. ధర తగ్గించిన తర్వాతా.. కోవిషీల్డ్‌తో పోల్చితే కోవాగ్జిన్‌ ధర ఇంకా రూ.100 ఎక్కువే ఉండటం గమనార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: