ఏపీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన చిత్తూరు
జిల్లా తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంతలోనే ఈ ఉప ఎన్నిక రద్దు అవుతుందా ? అన్న సందేహాలు ఒక్కసారిగా ముసురుకున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార
వైసీపీ దొంగ ఓట్లతో రిగ్గింగ్‌కు పాల్పడిందంటూ పిటిషన్లు వేశారు. ఈ క్రమంలోనే ఈ ఉప ఎన్నిక రద్దుపై నేడు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది.
తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ తెలుగుదేశం,
బీజేపీ పిటీషన్లను హైకోర్టు నేడు విచారణ జరపనుంది. దీనిపై హైకోర్టు నేడు విచారణ జరపనుంది. పిటిషన్లు వేసిన వారు కొన్ని ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించడంతో కోర్టు ఏం చేస్తుందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ ఉంది.