దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోన్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. టీఎంసీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఆ పార్టీ 161 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 115 సీట్లతో ఆధిక్యంలో ఉంది. అయితే మమత పోటీ చేస్తోన్న నందిగ్రామ్ నియోజకవర్గలో మాత్రం ఆమె వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్లో 1500 ఓట్లు వెనకపడిన ఆమె రెండో రౌండ్ ముగిసే సరికి ఏకంగా 4500 ఓట్లు వెనకపడిపోయారు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మమత హోరాహోరీ పోరులో ఓడిపోతారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.