ఖ‌మ్మంలో కారు జోరుకు బ్రేక్... మిక్స్‌డ్ ఫ‌లితాలు

VUYYURU SUBHASH
ఖ‌మ్మం కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో కారు జోరు చూపిస్తున్నా మ‌రీ వార్ వ‌న్‌సైడ్‌గా అయితే లేదు. ఇక్క‌డ నుంచి బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం అభ్య‌ర్థులు కూడా కార్పోరేట‌ర్లుగా గెలిచారు. ఇప్ప‌టివ‌ర‌కు అందిన ఫ‌లితాలు ఇలా ఉన్నాయి.

ఒకటో డివిజన్ టీఅర్ఎస్ అభ్యర్థి తేజావత్ హుస్సేన్ - 3వ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్తపల్లి నీరజ - 7వ డివిజన్‌లో బీజేపీ దొంగల సత్యనారాయణ  -  20వ డివిజన్ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రశాంత్ లక్ష్మీ -  25వ డివిజన్‌లో టీఆఎస్‌ అభ్యర్థి చంద్రకళ గెలుపొందారు.  ఇక 31వ డివిజన్‌లో సీపీఎం అభ్యర్థి ఎర్ర గోపి, 37వ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ఫాతిమా జోహార,  43వ డివిజన్ నుంచి సీపీఐ అభ్యర్ధి క్లైమేట్ విజయం సాధించారు.

55వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మోతారపు శ్రావణి, 56వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైడిపల్లి రోహిణి గెలుపొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: