తెలంగాణలో మినీ పుర పోరులో కారు దూసుకుపోతోంది. ఖమ్మం, గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్లతో పాటు ఎన్నికలు జరిగిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు, సిద్ధిపేట అన్ని చోట్లా టీఆర్ఎస్ దే గెలుపు అయ్యింది. ఇక రంగారెడ్డి జిల్లాలో చిన్న మున్సిపాల్టీ అయిన కొత్తూరు కూడా కారు ఖాతాలో పడింది. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా 7 చోట్ల టీఆర్ఎస్, 5 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ 5 వార్డుల్లో విజయం సాధించడం గొప్పే అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.