హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ మహానగరంలో సోమవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. బలమైన ఈదురు గాలులతో పడిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, అమీర్‌పేట, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, ఉప్పల్, తార్నాక, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, సంతోష్ నగర్, కోఠి, మెహిదీపట్నం, టోలిచౌకీ, లక్డికాపూల్, సోమాజిగూడ, ఖైరతాబాద్, మియాపూర్, కొండాపూర్, హైటెక్‌సిటీతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడ్డింది. భారీ వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కు సైతం అంతరాయం ఏర్పడింది.