క‌ని క‌రోనా: ఫ్రీజ‌ర్ బాక్సుల రెంట్లు చూస్తే గుండె గుబేల్‌

VUYYURU SUBHASH
కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో కాస్ట్‌ ఆఫ్‌ డెత్‌ కూడా చాలా ఎక్కువైంది. క‌రోనా రోగుల‌కు ఆసుప‌త్రిలో వైద్య‌మే ఖ‌రీదైపోయింది. ఆక్సిజ‌న్‌, మందులు, బెడ్లు ఇవి ల‌క్ష‌ల్లోనే ఉంటున్నాయి. ఒక‌వేళ క‌రోనా రోగి చ‌నిపోతే కొన్ని గంటలు భద్రపరచడానికి ఉపకరించే డెడ్‌ బాడీ ఫ్రీజర్‌ బాక్సుల అద్దెలూ ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధార‌ణంగా ఫ్రీజ‌ర్ బాక్సుల అద్దె 24 గంటలకు గరిష్టంగా రూ.8 వేల వరకు ఉండేది. అయితే ప్రస్తుత సమయంలో వాటి యజమానులు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ రెంట్లు చూసిన వారు గుండెలు గుబేల్ మంటోన్నాయి. ఏదేమైనా క‌రోనా పేరుతో దోచుకునేందుకు కాదేది అన‌ర్హం అన్న‌ట్టుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: