బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ మార్గదర్శకాలు విడుదల..!!

Madhuri
తెలంగాణలో లాక్‌డౌన్‌  విధిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రేప‌టి నుంచి ప‌దిరోజుల పాటు ఈ లాక్‌డౌన్‌ కొన‌సాగ‌నుంది. ప్ర‌తిరోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మాత్రం లాక్‌డౌన్‌ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. నిత్య‌వ‌స‌రాలు, ఇత‌ర వ‌స్తువుల కొనుగోలుకు ఈ స‌మ‌యంలో వెసులుబాటు క‌ల్పించారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లు కానుంది. ఈ స‌మ‌యంలో దాదాపు అన్ని కార్య‌క‌లాపాలు నిలిచిపోనున్నాయి. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు.  దీంతో తెలంగాణలో బస్సుల టైమింగ్స్ పై ఆర్టీసి కీలక ప్రకటన చేసింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే బస్సులు నడుపుతామని తెలిపింది. అంతరాష్ట్ర సర్వీసులు నడపమని ఆర్టీసి స్పష్టం చేసింది.
లాక్ డౌన్ కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
*వైద్యశాఖ సర్వీసులు, కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
*తెలంగాణలో యధావిధిగా ధాన్యం కొనుగోళ్లు.
*లాక్ డౌన్ నుంచి వ్యవసాయ రంగానికి మినహాయింపు. ఉపాధి హామీ పనులు కొనసాగుతాయి.
*పెళ్లిలకు గరిష్టంగా 40 మందికి అనుమతి. అంత్యక్రియలకు 20 మంది.
*వైద్య,విద్యుత్, మీడియా రంగాలకు అనుమతి.
*33 శాతం మందితో ప్రభుత్వ ఆఫీసులు నడుస్తాయి.
* వైద్య రంగంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతి.
*గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా కొనసాగింపు.
* కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు
* గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.
* సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: