అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందనక్కర్లేదని స్పష్టం చేశాడు. అయితే క్వారంటైన్‌లో బన్నీ సోషల్ మీడియా ద్వారా తన పిల్లలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ను సంతోషపరచిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అభిమానులకు శుభ వార్త అందించారు. తాజాగా జరిపిన పరీక్షలలో కరోనా నెగిటివ్ వచ్చినందని ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ మేరకు బన్నీ తన ఇన్ స్టా ఖాతాలో.. "అందరికి హాయ్.. 15 రోజుల క్వారంటైన్ అనంతరం.. ఇప్పుడు జరిపిన టెస్టులలో కరోనా నెగిటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్ డౌన్ పనిచేస్తుందని నమ్ముతున్నాను. బీ హోం. బీ సేఫ్.. "అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.