రీసెంట్‌గా ఎన్టీఆర్‌కు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. పాజిటివ్ వచ్చినప్పటి నుండి ఐసోలేషన్‌లో ఉంటున్న ఎన్టీఆర్ ఆరోగ్యం కాస్త కుదుట పడిందట. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కరోనా సోకిందన్న వార్త ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఎన్టీఆర్ కి కరోనా అని తెలిసి ఫ్యాన్స్, చిత్ర ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేయడం జరిగింది. కాగా నేడు రంజాన్ పండుగను పురస్కరించుకొని ఎన్టీఆర్ ముస్లిం సోదరులకు ఈద్ విషెష్ తెలియజేశారు. ఈ రోజు ఈద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన వారికి ధన్యవాదాలు. ప్రస్తుతం నా ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంది. త్వరలోనే నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి అని పేర్కొన్నారు.