కోవిడ్ బాధితులకు బ్లాక్ ఫంగస్ ముప్పు ముంచుకొస్తోంది. కొవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్ మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతుండడంతో దాని నివారణ, నియంత్రణపై
కేంద్ర ఆరోగ్య శాఖ
మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం పలు సూచనలు చేశారు. ఈ ఫంగస్ కారణంగా బాధితులు ప్రాణాలు కోల్పోతుండడంతో.. తొలినాళ్లలోనే గుర్తించి చికిత్స చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా బ్లాక్ ఫంగస్‌ను నిరోధించవచ్చని ఆయన తెలిపారు. జ్వరం, రక్తపు వాంతులు, తలనొప్పి, కళ్లు, ముక్కు ఎరుపెక్కడం,ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో కనిపిస్తాయి.
నివారణకు సూచనలు:
* మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి, తరచూ రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలి.
* వైద్యుల సూచన మేరకు స్టెరాయిడ్లు ఉపయోగించాలి.
*
ఆక్సిజన్ చికిత్సలో వాడే హ్యుమిడీఫయర్స్ కోసం పరిశుభ్రమైన నీటిని వినియోగించాలి.
* నిర్ధారిత మోతాదులోనే యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్ ఔషధాలను వాడాలి.
ఇలా చేయండి:
*బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యంగా ఉండకండి
*రెమిడిసివిర్ అనవసరంగా వాడవద్దు
*బ్లాక్ ఫంగస్ చికిత్సలో నిర్లక్ష్యంగా ఉండడం.
*వ్యక్తిగత శుభ్రత పాటించాలి