తెలుగు సినీ సాహిత్యానికి మెరుగులు దిద్దిన వారిలో వేటూరి తరువాత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనే చెప్పుకోవాలి. ఈయన కలం నుండి వచ్చిన అద్బుతమైన పాటలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. నేడు సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ఆయనకు ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. సిరివెన్నెల శిష్యుడు, పాటల రచయిత అయిన బాస్కర బట్ల ట్విట్టర్ లో ఆయన గురువుకు వెషెస్ తెలిపారు.. " ఎప్పటికప్పుడు నన్ను నేను చెక్కుకోడానికి ఉపయోగపడే పదునైన , బలమైన ఆయధం ..మా గురువు.. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ బాస్కర బట్ల విషెస్ తెలిపారు.